Varun Tej: 'గద్దలకొండ గణేశ్' ఐదు రోజుల వసూళ్లు

  • ఈ నెల 20న వచ్చిన 'గద్దలకొండ గణేశ్'
  • ప్రపంచవ్యాప్తంగా 18.5 కోట్ల షేర్
  • వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ 

వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'గద్దలకొండ గణేశ్' ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజునే ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా, ఐదు రోజుల్లోనే మంచి వసూళ్లను సాధించింది.

తొలి ఐదు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 18.5 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా తొలి ఐదు రోజుల్లో 5.90 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. వచ్చేనెల 2వ తేదీన 'సైరా' వచ్చేంత వరకూ ఈ సినిమాకి పోటీలేదు. అందువలన మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీని కలిపి హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాకి, 'దేవత' సినిమాలోని పాట .. పూజా హెగ్డే గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

More Telugu News