profesor: మహిళా ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఇంజనీరింగ్‌ విద్యార్థి అరెస్ట్

  • ఒకే రాష్ట్రం వారు కావడంతో విద్యార్థితో స్నేహం చేసిన ప్రొఫెసర్ 
  • ఆమెను బెదిరించి నగ్న వీడియో చిత్రీకరణ
  • కోరిక తీర్చకుంటే వీడియో సామాజిక మాధ్యమాల్లో పెడతానని హెచ్చరిక

తాను ప్రొఫెసర్‌నన్న విషయం మర్చిపోయి  విద్యార్థితో స్నేహం చేయడం ఆమె తప్పయితే, ప్రొఫెసర్‌నే బెదిరించి లైంగిక వేధింపులకు దిగాడు సదరు ప్రబుద్ధుడు. ఆమె నగ్నవీడియో తీసి దాన్ని చూపించి లైంగికంగా వేధిస్తుండడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ప్రస్తుతం సదరు విద్యార్థి కటకటాలు లెక్కిస్తున్నాడు.

పోలీసుల కథనం మేరకు... తమిళనాడులోని కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువతి(25) ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. అదే కళాశాలలో ఏపీకి చెందిన వివేశ్‌ (23) ఇంజనీరింగ్‌ చదువుతూ అంబత్తూర్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.

ఈ నేపధ్యంలో తన చదువు పూర్తవుతున్నందున పార్టీ ఇస్తున్నానని, మీరు కూడా రావాలంటూ సదరు యువతిని ఈనెల 19న వివేశ్ కోరాడు. అందుకు ఆమె అంగీకరించడంతో రాత్రి ఏడు గంటల సమయంలో షోలింగ్‌నుల్లూర్‌లో ప్రొఫెసర్‌ ఉంటున్న మహిళా హాస్టల్‌కు వెళ్లి ఆమెను పికప్‌ చేసుకున్నాడు. అనంతరం బైక్‌పై ఆమెను ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డుకు తీసుకువెళ్లాడు. పూంజేరీ సమీపాన ఉన్న చీకటి ప్రాంతంలో వాహనాన్ని ఆపడంతో భయపడిన ఆమె ఇక్కడెందుకని ప్రశ్నించింది.

ఇక్కడే ఉన్న రిసార్ట్‌లో పార్టీ ఏర్పాటు చేశానని చెప్పి ఆమెను పొదల చాటుకు తీసుకువెళ్లాడు. అనంతరం కత్తి చూపించి ఆమెను దుస్తులు విప్పమని బెదిరించాడు. ఆమె దుస్తులు విప్పుతుంటే వీడియో తీశాడు. అనంతరం ఆమెను హాస్టల్‌ వద్ద దించేశాడు. ఆ తర్వాత నుంచి ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. తన కోర్కెను తీర్చకుంటే వీడియో సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించడం మొదలు పెట్టాడు. దీంతో భయపడిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వివేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను తీసిన వీడియోను డిలీట్‌ చేశారు.

More Telugu News