Andhra Pradesh: వైసీపీ సర్కార్ కు మరో షాక్.. పీపీఏలపై పున:సమీక్ష జీవో 63ని కొట్టేసిన హైకోర్టు

  • కుదించిన టారిఫ్ ప్రకారం తాత్కాలిక చెల్లింపులు చేయాలి
  • పీపీఏల టారిఫ్ వ్యవహారాన్ని 6 నెలల్లోగా ఈఆర్సీ పరిష్కరించాలి
  • ఏపీ హైకోర్టు ఆదేశాలు

ఏపీలో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు (పీపీఏ) పున: సమీక్షపై ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పీపీఏల పున: సమీక్షపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు జీవో 63ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ విద్యుత్ సంస్థలకు కుదించిన టారిఫ్ ప్రకారం తాత్కాలిక చెల్లింపులు చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

పీపీఏల టారిఫ్ వ్యవహారాన్ని ఆరు నెలల్లోగా ఈఆర్సీ పరిష్కరించాలని ఆదేశించింది. ఇప్పటివరకూ నిర్ణయించిన ధర ప్రకారం ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, వివిధ కారణాలతో విద్యుత్ ను తీసుకోవడం నిలిపివేసిన సంస్థల నుంచి వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈలోగా మధ్యంతర చెల్లింపు కింద యూనిట్ కు రూ.2.43 నుంచి రూ.2.44 పైసలు చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను న్యాయస్థానం అంగీకరించింది.

More Telugu News