Facebook: అత్యంత ప్రమాదకరమైన 10 వేల యాప్స్ ను తొలగించిన ఫేస్‌బుక్

  • కేంబ్రిడ్జి అనలిటికా కేసులో భారీ జరిమానాకు గురైన ఫేస్‌బుక్
  • 400 మంది డెవలపర్లకు చెందిన 10 వేల యాప్స్ తొలగింపు
  • అప్లికేషన్ ప్రోగ్రాం ఇంటర్‌ఫేస్‌ కూడా తొలగింపు

ప్రమాదకరమైన పదివేల యాప్స్‌ను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తొలగించింది. వినియోగదారుల అంతర్గత భద్రతకు వీటివల్ల ప్రమాదం లేనప్పటికీ వీటిలో చాలా యాప్స్ పరీక్షల దశలో ఉండడం, మరికొన్ని పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో తొలగించినట్టు ఫేస్‌బుక్ వివరణ ఇచ్చింది. మొత్తంగా 400 మంది డెవలపర్లకు చెందిన 10 వేల అప్లికేషన్లను తొలగించినట్టు తెలిపింది.

గతేడాది వెలుగుచూసిన కేంబ్రిడ్జి అనలిటికా వివాదం నేపథ్యంలో ఫేస్‌బుక్ ఈ చర్యలు చేపట్టింది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం యాప్ డెవలపర్స్‌కు తెలిసే అవకాశం ఉన్న అప్లికేషన్ ప్రోగ్రాం ఇంటర్‌ఫేస్‌ను కూడా తొలగించినట్టు ఫేస్‌బుక్ వెల్లడించింది. కేంబ్రిడ్జి అనలిటికా కేసులో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) ఫేస్‌బుక్‌కు ఐదు బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకుంది.

More Telugu News