Hyderabad: దుండిగల్ లో దుండగుల బీభత్సం.. ఎస్సైను కారుతో ఢీ కొట్టే యత్నం!

  • ఓ నగల దుకాణంలో దోపిడీకి యత్నం
  • ఈ సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు
  • సినీ ఫక్కీలో దుండగులను వెంబడించిన పోలీసులు

హైదరాబాద్ శివారు దుండిగల్ లో దుండగులు బీభత్సం సృష్టించారు. ఓ నగల దుకాణంలో దోపిడీకి యత్నించారు. ఈ సమాచారం మేరకు ఎస్సై, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దుండగులు పారిపోయే క్రమంలో ఎస్సైను తమ కారుతో ఢీకొట్టేందుకు యత్నించారు. సినీ ఫక్కీలో ఆ కారును పోలీసులు వెంబడించారు. దుండగులు వారు ప్రయాణిస్తున్న కారును దూలపల్లి వద్ద చెట్టుకు ఢీ కొట్టారు. అనంతరం అక్కడి నుంచి అడవిలోకి పారిపోయారు. ఆ కారులో ఉన్న కట్టర్లు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News