Andhra Pradesh: పంట సాగుదారుల హక్కుల చట్టం-2019 అమలుకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ

  • చట్టం మార్గదర్శకాలను వివరించిన సర్కారు
  • కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందం కుదరదని వెల్లడి
  • భూ యజమాని-కౌలుదారు ఒప్పందంపై స్పష్టత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంట సాగుదారుల హక్కుల చట్టం-2019 అమలుకు నోటిఫికేషన్ జారీ చేశారు. తాజాగా పంట సాగుదారుల హక్కుల చట్టం మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. వీఆర్వో సమక్షంలో సాగు ఒప్పందం కుదుర్చుకోవాలని స్పష్టం చేసింది. పంట సాగుదారు హక్కుల కార్డు ఆధారంగా ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించింది. ఈ తరహా ఒప్పందం కుటుంబ సభ్యుల మధ్య చెల్లదని నోటిఫికేషన్ లో వెల్లడించారు. భూ యజమాని-కౌలుదారు మధ్య ఒప్పందం గరిష్ఠ కాలావధిని 11 నెలలుగా నిర్ణయించారు.

ఒప్పందంలో భాగంగా కౌలుదారుకు భూ యజమాని ఏడాది పొడవునా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఒప్పందాన్ని రికార్డు చేసి గ్రామ సచివాలయంలో భద్రపరుచుకోవచ్చని వివరించారు. పంట సాగుదారుల హక్కుల కార్డుల నమోదుకు ప్రత్యేక రిజిస్టర్ ఉంచాలని, సంబంధిత ప్రతిని తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. హక్కుల కార్డును గ్రామ సచివాలయంలోనే భద్రపరిచేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది.

More Telugu News