India: బాలాకోట్ లో మళ్లీ ఉగ్ర కదలికలు... ఈసారి తమ దాడులు మామూలుగా ఉండవన్న భారత ఆర్మీ చీఫ్

  • చెన్నై సైనిక శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన బిపిన్ రావత్
  • బాలాకోట్ ఉగ్ర శిబిరం పునఃప్రారంభమైందని వెల్లడి
  • సరిహద్దు వెంబడి వందలమంది ఉగ్రవాదులు ఉన్నారన్న ఆర్మీ చీఫ్

గత ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందడం, ఆపై భారత వైమానిక దళం పాకిస్థాన్ బాలాకోట్ లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరాన్ని నేలమట్టం చేయడం తెలిసిందే. అయితే, ఇప్పుడక్కడ మళ్లీ ఉగ్ర శిబిరం ప్రారంభమైందని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అంటున్నారు. బాలాకోట్ లో తాజాగా ఉగ్ర కదలికలు కనిపిస్తున్నాయని, అయితే ఈసారి తమ సైనిక చర్య గత దాడుల కంటే తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేశారు. భారత్ లో చొరబడి కల్లోలం సృష్టించేందుకు సరిహద్దు పొడవునా వందల మంది ఉగ్రవాదులు అదను కోసం వేచి చూస్తున్నారని, దీన్ని తాము ఓ కంట కనిపెడుతున్నామని రావత్ వెల్లడించారు. చెన్నైలోని సైనికాధికారుల శిక్షణ కేంద్రంను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News