LV Subrahmanyam: ఎల్వీ సుబ్రహ్మణ్యంపై హర్షకుమార్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • సీనియర్ ఐఏఎస్ అధికారిని వాడు, వీడు అన్నారు
  • మీడియా సైతం దీనిపై స్పందించలేదు
  • హర్షకుమార్ తక్షణమే క్షమాపణ చెప్పాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు. హర్షకుమార్ వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఉద్దేశించి వాడు, వీడు అంటూ అనాగరిక భాష వాడారని... అయినా, ఇంత వరకు మీడియా సైతం స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. హర్షకుమార్ తక్షణమే క్షమాపణ చెప్పి, బాధ్యత గల మనిషినని నిరూపించుకుంటారని భావిస్తున్నానని చెప్పారు.

అంతకు ముందు ఎల్వీ సుబ్రహ్మణ్యం గురించి హర్ష కుమార్ తీవ్ర పదజాలంతో ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 'వీడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అంట. రాజ్యాంగం తెలియని వాడు. రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఉంటున్నారు. ఈ ముగ్గురునీ సమానంగా చూడలేని వీడిని ఆ పదవి నుంచి తొలగించాలి' అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News