Balakrishna: పూరి మూవీలో పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ

  • కేఎస్ రవికుమార్ తో బాలకృష్ణ 
  • తదుపరి సినిమా బోయపాటితో 
  • పూరితో సినిమాకి కథ సిద్ధం  

ప్రస్తుతం బాలకృష్ణ .. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు తరువాత బోయపాటితో కలిసి బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.

ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ తో కలిసి బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా వార్తలు వచ్చాయి. పూరి సిద్ధం చేసిన కథను బాలకృష్ణ వినేయడం .. ఓకే చెప్పేయడం కూడా జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. గతంలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమాలు చాలా వరకూ సక్సెస్ అయ్యాయి. ఆ పాత్రలకి మించి ఈ రోల్ ఉంటుందని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు 'పైసా వసూల్' వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News