Varun tej: తెలుగు రాష్ట్రాల్లో 'గద్దలకొండ గణేశ్' దూకుడు

  • 'గద్దలకొండ గణేశ్'కి సక్సెస్ టాక్ 
  • మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ 
  • పెరుగుతోన్న వసూళ్లు

వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'గద్దలకొండ గణేశ్' ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజునే ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. తొలి 3 రోజుల్లో ఈ సినిమా 13.4 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తొలి 3 రోజుల వసూళ్ల విషయంలో వరుణ్ తేజ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా ఇదేనని చెబుతున్నారు.

ఇంతకుముందు వరుణ్ తేజ్ చేసిన 'ఫిదా' .. 'తొలిప్రేమ' సినిమాలకంటే ఈ సినిమా వసూళ్లు ఎక్కువ. వరుణ్ తేజ్ మాస్ లుక్ .. పూజా హెగ్డే గ్లామర్ .. ఆకట్టుకునే కామెడీ .. సాంగ్స్ ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'సైరా' విడుదలయ్యే వరకూ 'గద్దలకొండ గణేశ్'కి పోటీగా నిలిచే సినిమాలేమీ లేవు. అందువలన ఈ సినిమా వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

More Telugu News