bse: 'హౌడీ మోదీ' ఎఫెక్ట్... నిమిషాల్లో 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్!

  • కొనుగోళ్లతో వెల్లువెత్తిన మార్కెట్
  • ఓ దశలో 39 వేల మార్క్ ను దాటిన సెన్సెక్స్
  • ప్రస్తుతం 2 శాతం లాభంలో సూచికలు

నిన్న రాత్రి హ్యూస్టన్ లోని ఎన్ఆర్జీ మైదానం వేదికగా జరిగిన 'హౌడీ మోదీ' బహిరంగ సభ మన స్టాక్ మార్కెట్ పై అనుకూల ప్రభావాన్ని చూపింది. ఈ ఉదయం మార్కెట్ సెషన్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 350 పాయింట్లకు పైగా లాభపడింది. అన్ని సెక్టార్ల ఈక్విటీల్లోనూ కొనుగోళ్లు వెల్లువెత్తాయి.

ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన మద్దతుతో సెన్సెక్స్ 39 వేల పాయింట్ల మార్క్ ను అధిగమించింది. నిఫ్టీ సైతం 11,550 పాయింట్లను దాటింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఇన్ ఫ్రా, ఆటో రంగాల్లోని ఈక్విటీలతో పాటు హోటల్ కంపెనీలు భారీ లాభాల్లో నడుస్తున్నాయి.

ఆపై ఉదయం 10 గంటల తరువాత కాస్తంత లాభాల స్వీకరణ సైతం కనిపించింది. దీంతో ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 744 పాయింట్ల లాభంతో 38,759 పాయింట్ల వద్దా, నిఫ్టీ, 227 పాయింట్ల లాభంతో 11,501 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి.

More Telugu News