Chandrababu: చంద్రబాబు గారు, అసలు సినిమా ఇప్పుడే మొదలైంది: విజయసాయిరెడ్డి

  • పోలవరం డ్యామ్ పునాదుల నుంచి అవినీతి సాక్ష్యాలు ఉబికి వస్తున్నాయి
  • ఎవరి కాళ్లు పట్టుకుని బయటపడాలా అని చంద్రబాబు వెతుకుతున్నారు
  • జగన్ తీసుకున్న నిర్ణయాలను 15 రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. పోలవరంలో దోచుకున్న డబ్బుతో ఎన్నికల్లో గెలవాలనుకున్నారని... అయితే, ప్రజలు తుపుక్కున ఉమ్మడంతో, నడుములు విరిగేలా నేలపై పడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. పోలవరం డ్యామ్ పునాదుల నుంచి అవినీతి సాక్ష్యాలు ఉబికి వస్తున్నాయని చెప్పారు. ఎవరి కాళ్లు పట్టుకుని బయటపడాలా? అని చంద్రబాబు వెతుకుతున్నారని... అసలు సినిమా ఇప్పుడే మొదలైందని అన్నారు.

అమ్మ ఒడి, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, జ్యుడీషియల్ కమిషన్, రివర్స్ టెండరింగ్, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటి సాహసోపేతమైన నిర్ణయాలను ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. జగన్ తీసుకున్న నిర్ణయాలను 15 రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయని అన్నారు. మొదటి సారి ముఖ్యమంత్రి అయిన 46 ఏళ్ల యువకుడు యావత్ దేశానికి మార్గదర్శిలా నిలుస్తున్నాడని కితాబిచ్చారు.

More Telugu News