Lakshman: అప్పును కూడా ఆదాయంగా చూపిన ఘనుడు కేసీఆర్... అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ని చేయాలి: లక్ష్మణ్ విమర్శలు

  • కేసీఆర్ పై ధ్వజమెత్తిన తెలంగాణ బీజేపీ చీఫ్
  • అసెంబ్లీలో కేసీఆర్ చెప్పినవి పచ్చి అబద్ధాలని వెల్లడి
  • తెలంగాణ కోసం 1990లోనే  బీజేపీ పోరాడిందన్న లక్ష్మణ్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ చీఫ్ కె.లక్ష్మణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. అప్పును కూడా ఆదాయంగా చూపించిన ఘనత కేసీఆర్ కే చెల్లిందని విమర్శించారు. అసెంబ్లీలో కేసీఆర్ చెప్పినవి పచ్చి అబద్ధాలని ఆరోపించారు. కేసీఆర్ ను అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలని వ్యంగ్యం ప్రదర్శించారు. ఆర్థిక పరిస్థితికి సంబంధించి అనేక అంశాలపై ప్రభుత్వాన్ని కాగ్ తప్పుబట్టిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరలేదని వెల్లడించారు.

1990లోనే తెలంగాణ కోసం బీజేపీ పోరాటం చేసిందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ను వ్యక్తిగతంగా దూషించిన చరిత్ర కేసీఆర్ దని మండిపడ్డారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, కోదండరాంలను కూడా అవమానించారని అన్నారు. రాష్ట్రంలో పాలన టీఆర్ఎస్ దే అయినా, ఎంఐఎం అజెండా కొనసాగుతోందని లక్ష్మణ్ విమర్శించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కు పీఏసీ పదవి ఇవ్వడం అనైతికం అని అభిప్రాయపడ్డారు.

More Telugu News