Godavari: గోదావరి నుంచి బోటును బయటికి తీసే అవకాశమే లేదు: కిషన్ రెడ్డి వెల్లడి

  • బోటు మునకపై కిషన్ రెడ్డి సమీక్ష
  • రాజమండ్రిలో ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో భేటీ
  • కేంద్రం నుంచి సాంకేతిక సహకారం అందిస్తామని హామీ

గోదావరి నదిలో బోటు మునకపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజమండ్రి వెళ్లిన కిషన్ రెడ్డి రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమావేశమయ్యారు. బోటు వెలికితీత పనులు, సహాయ చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో బోటును బయటికి తీసే అవకాశం లేదని స్పష్టం చేశారు.బోటు వెలికితీతకు కేంద్రం నుంచి సాంకేతిక సహకారాన్ని అందిస్తామని చెప్పారు. బోటింగ్ కార్యకలాపాల్లోనూ ఎయిరిండియా తరహా తనిఖీలు అమలు చేయాలని తెలిపారు. కాగా, ఈ సమావేశంలో ఏపీ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీలు జక్కంపూడి రాజా, సోము వీర్రాజు, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, డీఐజీ, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News