KTR: కొత్త మున్సిపల్ చట్టం గురించి వివరించిన కేటీఆర్

  • మున్సిపల్ చట్టానికి ఐదు సవరణలు
  • 75 గజాల లోపు స్థలంలో ఇంటి నిర్మాణానికి అనుమతి అక్కర్లేదన్న కేటీఆర్
  • రాజకీయపక్షాలు సమ్మతిస్తే రోడ్లపై ఉన్న మందిరాలు తొలగిస్తామని వెల్లడి

తెలంగాణ ప్రభుత్వం  కొత్త మున్సిపల్ చట్టం తీసుకురావాలని సంకల్పించడం తెలిసిందే. దీనిపై శాసనమండలిలో చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మున్సిపల్ చట్టానికి ఐదు సవరణలు చేశామని వెల్లడించారు. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవాళ్లు కూడా పురపాలక ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు.

75 గజాల లోపు స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎవరి అనుమతి అవసరంలేదని, 76 నుంచి 600 గజాల లోపు ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే ఆన్ లైన్ లో అనుమతి తీసుకోవాలని వివరించారు. ఈ తరహా అనుమతులు 21 రోజుల్లో జారీ చేస్తామని వెల్లడించారు. రాజకీయ పార్టీలు సమ్మతిస్తే రహదారులపై ఉన్న ప్రార్థనా మందిరాలను తొలగిస్తామని అన్నారు.

More Telugu News