Hyderabad: కొన్ని గంటల్లో ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుక!

  • ఎల్బీ నగర్ లోని స్టేడియంలో ప్రీ-రిలీజ్ వేడుక
  • ఇప్పటికే స్టేడియంలో భారీ ఏర్పాట్లు
  •  ఆసక్తితో ఎదురుచూస్తున్న అభిమానులు 

టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా’.. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లోని స్టేడియంలో ఈరోజు సాయంత్రం వేడుక జరగనుంది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలో భాగంగా నిర్వహించనున్న డ్యాన్స్ ల కోసం కళాకారులు సిద్ధమవుతున్నారు. కాగా, రామ్ చరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, తదితరులు నటించారు.

More Telugu News