Naigerians: దేశంలోనే తొలిసారి... దొరికిన నైజీరియన్ ను దొరికినట్టు విమానం ఎక్కించేస్తున్న హైదరాబాద్ పోలీసులు!

  • పలు రకాల వీసాలతో వస్తున్న నైజీరియన్లు
  • అమాయకులను ముంచేస్తూ లక్షల్లో దోపిడీ
  • వెనక్కు పంపించేస్తున్నామన్న వీసీ సజ్జన్నార్

చదువు పేరిట, ఇండియాలో పర్యాటక ప్రదేశాలను తిరుగుతామని చెబుతూ, వివిధ రకాల వీసాలపై ఆఫ్రికా దేశాల నుంచి వచ్చి, నేరాలకు పాల్పడుతూ, కోట్లు కొల్లగొడుతున్న వారిపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించారు. ఇండియాలోనే తొలిసారిగా, ఓ నైజీరియా నేరస్తుడిని పట్టుకుని, అతని దేశానికి డిపోర్ట్ చేసినట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ తెలిపారు. దొరికిన వారిని దొరికినట్టు వారి దేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేశామని, ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు.

వైద్య, విద్యార్థి, పర్యాటక వీసాలపై వస్తున్న నైజీరియన్లు, ఇండియాలో నేరాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. ఇటీవలే మెడికల్ అటెండింగ్ వీసాపై ఇండియాకు వచ్చిన వాలెంటైన్ కెవిన్ అనే యువకుడు, వీసా గడువు ముగిసిన తరువాత కూడా నాలుగున్నర ఏళ్లు ఇండియాలో ఉన్నాడని అన్నారు. అతన్ని ఢిల్లీ  శివార్లలో అరెస్ట్ చేశామని, పలువురు అమాయకులను లక్షల్లో ముంచేశాడని సజ్జన్నార్ వివరించారు.

More Telugu News