ayyappa society: అవి అక్రమ నిర్మాణాలు.. కొని చిక్కుల్లో పడొద్దు: చందానగర్ డిప్యూటీ కమిషనర్ హెచ్చరిక

  • అయ్యప సొసైటీలో గతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
  • అదే స్థానంలో తిరిగి కొత్త నిర్మాణాలు
  • హఫీజ్‌పేటలోనూ అదే తీరు

హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని చందానగర్ డిప్యూటీ కమిషనర్ యాదగిరిరావు కోరారు. హాఫీజ్‌పేట్‌ సర్వే నంబరు 78 గోకుల్‌ ప్లాట్లలో గుర్తించిన 91 అక్రమ నిర్మాణాలను గతంలో కూల్చివేశామని, కానీ ఇప్పుడు వాటిని తిరిగి కడుతున్నారని పేర్కొన్న ఆయన వాటిని కొనుగోలు చేసి మోసపోవద్దని కోరారు. ఆయా ప్లాట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వవద్దని విద్యుత్ శాఖను కోరినట్టు తెలిపారు. ఒకవేళ అక్రమంగా విద్యుత్ కనెక్షన్లను తీసుకున్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

చందానగర్ సర్కిల్‌లోని ఖానామెట్ అయ్యప్ప సొసైటీలో గతంలో కూల్చివేసిన 17 ప్లాట్లలోనూ అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయని, వాటిని విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆయన వాటిని కొనుగోలు చేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు.

More Telugu News