Oscars: 'డియర్ కామ్రేడ్' కు నిరాశ... 'ఆస్కార్'  రేసులో 'గల్లీ బాయ్'

  • రణవీర్ హీరోగా వచ్చిన 'గల్లీబాయ్'
  • 28 సినిమాల నుంచి 'గల్లీబాయ్' ను ఎంపిక చేసిన జ్యూరీ
  • 92వ ఆస్కార్ పురస్కారాల కోసం నామినేషన్ల హడావుడి

ప్రపంచంలోని ప్రతి నటుడికి ఆస్కార్ అవార్డు అందుకోవడం ఓ కల అంటే అతిశయోక్తి కాదు. అవార్డులన్నింట్లోనూ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ పురస్కారాలు ప్రధానంగా హాలీవుడ్ చిత్రరంగానికి చెందినా, ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీ కారణంగా ఆస్కార్ అంటే అందరిలోనూ క్రేజ్ పెరిగిపోయింది. ఈ కేటగిరీలో పోటీ పడేందుకు ప్రతి దేశం నుంచి ఆస్కార్ కు నామినేషన్లు వెళుతుంటాయి. ఈసారి భారత్ నుంచి రణవీర్ సింగ్ హీరోగా నటించిన 'గల్లీబాయ్' చిత్రం ఆస్కార్ నామినేషన్లకు అర్హత సాధించింది.

'గల్లీబాయ్' చిత్రం 92వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో పోటీపడనుంది. భారత్ నుంచి ఆస్కార్ కు వెళ్లే చిత్రం కోసం జ్యూరీ 28 సినిమాలను వీక్షించి వాటిలో 'గల్లీబాయ్' కే ఓటేసింది. కాగా, ఆస్కార్ నామినేషన్ కోసం విజయ్ దేవరకొండ నటించిన టాలీవుడ్ మూవీ 'డియర్ కామ్రేడ్' చిత్రం కూడా రేసులో నిలిచింది. అయితే జ్యూరీ సభ్యులు 'గల్లీబాయ్' వైపే మొగ్గుచూపారు.

More Telugu News