ap7am logo

మురుగదాస్ తో బన్నీ మూవీ అంటూ ఫిల్మ్ నగర్ టాక్

Sat, Sep 21, 2019, 05:14 PM
  • త్రివిక్రమ్ సినిమాతో బిజీగా బన్నీ
  • లైన్లో సుకుమార్ - వేణు శ్రీరామ్ 
  • 'దర్బార్' పనుల్లో మురుగదాస్
ప్రస్తుతం అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. త్వరలో ప్యారిస్ లో పాటల చిత్రీకరణకు సిద్ధమవుతోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల బన్నీని కలిసి మురుగదాస్ ఒక కథ వినిపించాడనీ, బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనే ప్రచారం ఫిల్మ్ నగర్లో జోరుగా జరుగుతోంది. దాంతో ముందుగా బన్నీ ఓకే చెప్పిన సుకుమార్ .. వేణు శ్రీరామ్ ల ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటనే సందేహం అభిమానులను అయోమయానికి గురిచేసింది. అయితే మురుగదాస్ తో బన్నీ సినిమా వార్తలో నిజం లేదనేది తాజా సమాచారం. ముందుగా చెప్పినట్టుగానే త్రివిక్రమ్ తరువాత వేణు శ్రీరామ్, సుకుమార్ లతో బన్నీ సినిమాలు వుంటాయని అంటున్నారు. ప్రస్తుతం మురుగదాస్ 'దర్బార్' సినిమా పనులతో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
Tags: Allu Arjun
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad