Ntr: తమిళ దర్శకుడితో ఎన్టీఆర్ మూవీ?

  • రాజమౌళి సినిమాతో బిజీగా ఎన్టీఆర్
  • తదుపరి సినిమా అట్లీ కుమార్ తో 
  • లైన్లో కొరటాల - ప్రశాంత్ నీల్

ప్రస్తుతం ఎన్టీఆర్ .. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకోవడానికి మరికొంతకాలం పడుతుంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఏ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వనున్నాడనే ఆసక్తిని అభిమానులు కనబరుస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తమిళ దర్శకుడు అట్లీ కుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ తో 'బిగిల్' సినిమా చేస్తోన్న అట్లీ కుమార్, ఆ తరువాత ప్రాజెక్టును ఎన్టీఆర్ తోనే సెట్ చేసుకున్నాడని అంటున్నారు. మాస్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఒక కథను అట్లీ కుమార్ వినిపించగా, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. అట్లీ కుమార్ తరువాత కొరటాల శివతో .. ప్రశాంత్ నీల్ తోను కలిసి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లనున్నాడని చెబుతున్నారు.

More Telugu News