Uttar Pradesh: యూపీలో ఎన్‌ఆర్‌సీ అమలైతే తొలుత జరిగేది అదే.. అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

  • రాష్ట్రాన్ని వీడేది తొలుత ముఖ్యమంత్రే
  • ఎన్‌ఆర్‌సీని చూపించి ప్రతిపక్షాలను భయపెడుతున్నారు
  • పాకిస్థాన్ పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం

జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్ఆర్‌సీ) కనుక ఉత్తరప్రదేశ్‌లో అమలైతే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా రాష్ట్రాన్ని వీడాల్సి వస్తుందని, ఎందుకంటే ఆయన ఉత్తరాఖండ్ కు చెందిన వ్యక్తని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలను భయపెట్టేందుకు బీజేపీ నేతలు ఎన్‌ఆర్‌సీ‌ని పావుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.

గతంలో పాలకులు విభజించి పాలించేవారని, కానీ బీజేపీ నేతలు భయపెట్టి పాలిస్తున్నారని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌ పరిస్థితులపై అఖిలేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితులు  సాధారణంగా ఉన్నట్టు కేంద్రం చెబుతోందని, అదే నిజమైతే అక్కడ ఆంక్షలు విధించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పాకిస్థాన్ పేరుతో ఓట్లు దండుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించిన అఖిలేష్.. ప్రజలను చైతన్య పరిచి బీజేపీని గద్దె దించుతామని హెచ్చరించారు.  


More Telugu News