TRS: ఇకపై హరీశ్ రావుతో నాకు ఎలాంటి ఘర్షణ ఉండదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

  • నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తా 
  • మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది
  • కేసీఆర్ సర్కార్ పై  విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోరు

రాజకీయ వైరంతో పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్న టీఆర్ఎస్ నేత హరీశ్ రావు, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నిన్న కలుసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 14 ఏళ్ల తర్వాత  హరీశ్ రావుతో జగ్గారెడ్డి మాట్లాడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, ఈరోజు మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ, సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించేందుకే నిన్న హరీశ్ రావుని కలిసినట్టు చెప్పారు.

ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో ఇకపై తనకు ఎలాంటి ఘర్షణ ఉండదని, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తానని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను మరోమారు ప్రజలు గెలిపించి అధికారంలోకి తెచ్చారని, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోరని వ్యాఖ్యానించారు. రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు.

More Telugu News