Kakinada: కాకినాడలో కుంగిన అపార్టుమెంట్ కూల్చివేత తప్పదు.. నిర్ణయానికి వచ్చిన నిపుణులు!

  • ఈ అపార్టుమెంట్ నివాసయోగ్యం కాదు
  • ఏ విధానంలో కూల్చాలన్న విషయమై సమాలోచనలు
  • ‘బిల్డింగ్ ఇంప్లోజన్’ సాంకేతిక పద్ధతి వినియోగించాలని యోచన

కాకినాడలో పక్కకు ఒరిగిన అపార్టుమెంట్ నివాసయోగ్యం కాదని నిపుణులు అంటున్నారు. స్థానిక దేవీ మల్టీప్లెక్స్ సమీపంలోని ఐదు అంతస్తుల అపార్టుమెంట్ పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. మరమ్మతులతో ఉపయోగం లేదని, కుంగిన భవనం నివాస యోగ్యం కాదని జేఎన్టీయూ నిపుణులు తేల్చి చెప్పారు.

దీంతో ఏ విధానంలో ఈ అపార్టు మెంట్ ను కూల్చాలన్న విషయమై నిపుణులు ఆలోచిస్తున్నారు. జేసీబీల సాయంతో కూల్చాలా? లేక బ్రేకింగ్ బాల్ టెక్నిక్ తో కూల్చాలా? అనే విషయమై నిపుణులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ అపార్టుమెంట్ ను జేసీబీల సాయంతో కూల్చితే కనుక పక్కన ఉన్న భవనాలకు ప్రమాదం ఉంటుందని తెలుస్తోంది.

అదే, బ్రేకింగ్ బాల్ టెక్నిక్ ను ఉపయోగిస్తే ఐదు ఐరన్ బాల్స్ సాయంతో భవనాన్ని పై నుంచి కూల్చుకుంటూ వస్తారు. కానీ, పిల్లర్లు కుంగిఉన్న కారణంగా ఈ టెక్నాలజీని వినియోగించే అవకాశాలు తక్కువే అని తెలుస్తోంది. ‘బిల్డింగ్ ఇంప్లోజన్’ అనే ఆధునిక సాంకేతిక పద్ధతిని వినియోగించాలని నిపుణులు యోచిస్తున్నారు.

More Telugu News