Chandrababu: పోలవరం ఎత్తు తగ్గిస్తామని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారు... ఏపీ విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు?: చంద్రబాబు

  • గోదావరి-పెన్నా నదులను అనుసంధానిస్తే సరిపోతుంది
  • ఏపీ ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు
  • రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు

ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఏం తెలుసని రాష్ట్ర విషయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తామని అసెంబ్లీలో కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. తెలంగాణతో గొడవ పడాల్సిన అవసరం ఇప్పుడు ఏపీకి లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకుని... గోదావరి-పెన్నా నదులను అనుసంధానిస్తే సరిపోతుందని చెప్పారు. శ్రీశైలం ద్వారా గోదావరి జలాలను తరలించాల్సిన అవసరం లేదని అన్నారు. కేసీఆర్ తో కుమ్మక్కై ఏపీ ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని జగన్ కు హితవు పలికారు. నవయుగ సంస్థ పరిస్థితి ఏమిటని, బందరు పోర్టును ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని ఆరోపించారు. భేషజాలకు పోయి, రాష్ట్రాన్ని దరిద్రం చేస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News