Andhra Pradesh: టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావుకు ఏపీ హైకోర్టు నోటీసులు!

  • అనర్హత వేటేయాలని వైసీపీ నేత ఏసురత్నం పిటిషన్
  • బ్యాంకు రుణాలను ఎగవేశారని ఆరోపణ
  • అఫిడవిట్ లో తప్పుడు వివరాలు ఇచ్చారని విమర్శ

తెలుగుదేశం నేత, గుంటూరు పశ్చిమం ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావుకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. గిరిధర్ ఎన్నిక చెల్లందటూ వైసీపీ నేత ఏసురత్నం దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా ఏసురత్నం తరఫు న్యాయవాది వాదిస్తూ.. గిరిధర్ రావు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనీ, అఫిడవిట్ లో తప్పుడు వివరాలు దాఖలు చేశారని తెలిపారు. ఆయన మొత్తం 5 పేర్లతో వేర్వేరు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగవేశారని ఆరోపించారు.

ఎన్నికల సందర్భంగా  రిటర్నింగ్ అధికారి(ఆర్‌వో)తో కుమ్మక్కయిన గిరిధర్ రావు 4,040 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ కాగా, 312 మాత్రమే చెల్లేట్లు చేశారని విమర్శించారు. ఆయన్ను వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. ఎమ్మెల్యే మద్దాలి, ఆర్వోకు నోటీసులు జారీచేశారు. అనంతరం తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు.

More Telugu News