Banks: ఈ నెల 26 నుంచి వరుసగా ఐదు రోజులు మూతపడనున్న బ్యాంకులు

  • 26 నుంచి రెండు రోజులపాటు ఉద్యోగుల సమ్మె
  • 30న అర్ధ సంవత్సర ముగింపు
  • గాంధీ జయంతి సందర్భంగా 2న మళ్లీ మూత

ఈ నెల 26 నుంచి బ్యాంకులు వరుసగా ఐదు రోజులపాటు మూతపడనున్నాయి. 26 నుంచి రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్టు బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి. 28న నాలుగో శనివారం, 29న ఆదివారం కాబట్టి ఆ రెండు రోజులూ బ్యాంకులు తెరుచుకోవు. ఇక, 30న బ్యాంకులకు అర్ధ సంవత్సర ముగింపు రోజు.. కాబట్టి ఆ రోజు ఎటువంటి లావాదేవీలు ఉండవు. దీంతో తిరిగి అక్టోబరు 1న బ్యాంకు లావాదేవీలు ప్రారంభమవుతాయి. అయితే, అక్టోబరు 2న గాంధీ జయంతి కాబట్టి ఆ రోజు కూడా సెలవే. అంటే ఒక వారం మొత్తం బ్యాంకులు పనిచేయనట్టే. ఫలితంగా ఆ వారంలో దేశవ్యాప్తంగా వ్యాపార, నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున నిలిచిపోనున్నాయి.  

More Telugu News