punjab: యువతకు ఇచ్చిన హామీని నెరవేర్చే పనిలో పంజాబ్ ప్రభుత్వం.. త్వరలో యువతకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ

  • అధికారంలోకి వస్తే స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తామని హామీ
  • మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్
  • డిసెంబరు నుంచి దశలవారీగా పంపిణీ

గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా పంజాబ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని యువతకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్ అధ్యక్షతన డేరాబాబా నానక్ అనాజ్ మండీ వద్ద జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.

ఇందులో భాగంగా తొలుత 11, 12 తరగతులు చదువుతున్న స్మార్ట్‌ఫోన్ లేని విద్యార్థులకు వాటిని పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం పంపిణీ చేయనున్న స్మార్ట్‌ఫోన్లలో పలు ఫీచర్లు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ పథకాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు బహిరంగ వేలం ద్వారా కంపెనీలను ఎంపిక చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. డిసెంబరు నుంచి ఫోన్ల పంపిణీ దశల వారీగా ప్రారంభం కానుంది.

More Telugu News