Chandrayaan-2: ఆర్బిటర్ బాగానే పనిచేస్తోంది: ఇస్రో

  • ఈ నెల 7న చంద్రుడిపై దిగుతూ సంబంధాలు కోల్పోయిన విక్రమ్ ల్యాండర్
  • ఆర్బిటర్‌లోని పేలోడర్లు బాగానే పనిచేస్తున్నాయన్న ఇస్రో
  • నాసా లూనార్ ఆర్బిటర్ తీసిన చిత్రాల పరిశీలన

చంద్రుని కక్ష్యలో ఆర్బిటర్ సక్రమంగానే పనిచేస్తోందని గురువారం ఇస్రో ప్రకటించింది. ఆర్బిటర్‌లోని పేలోడర్లు కూడా బాగానే పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. అయినప్పటికీ విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు కలవకపోవడానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 7న చంద్రుడిపై ల్యాండ్ అవుతూ ఇస్రోతో విక్రమ్ ల్యాండర్ సంబంధాలు కోల్పోయింది. అప్పటి నుంచి దానితో సంబంధాల పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క, ఈ నెల 17న నాసా లూనార్ ఆర్బిటర్ తీసిన చిత్రాల్లో విక్రమ్ కనిపించిందా? లేదా? అన్న దానిపై పరిశీలన జరుగుతున్నట్టు ఇస్రో పేర్కొంది.

More Telugu News