Hero: హీరో వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ సినిమా పేరు మార్పు!

  • రేపు విడుదల కానున్న ‘వాల్మీకి’
  • బోయ సామాజికవర్గం అభ్యంతరంతో టైటిల్ మార్పు
  • ‘వాల్మీకి’ పేరును ‘గద్దలకొండ గణేశ్’గా మార్పు

హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘వాల్మీకి’ రేపు విడుదల కానుంది. ఈ చిత్రం విడుదలకు ముందు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ సినిమా టైటిల్ ను మారుస్తున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ‘వాల్మీకి’ సినిమా పేరును ‘గద్దలకొండ గణేశ్’గా మార్చినట్టు తెలిపారు. కాగా, ‘వాల్మీకి’ టైటిల్ పై బోయ సామాజికవర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ టైటిల్ తమ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉందని బోయహక్కుల పోరాటసమితి హైకోర్టులో పిటిషన్ వేసింది.

More Telugu News