Indonesia: ఇండోనేషియాను కుదిపేసిన వరుస భూకంపాలు.. రిక్టర్ స్కేలుపై 6.2 నమోదు!

  • జావా, బాలీ ద్వీపాల్లో ప్రకంపనలు
  • కంపించిన భవనాలు
  • భయంతో పరుగులు తీసిన ప్రజలు

ఇండోనేషియా దేశాన్ని ఈ రోజు వరుస భూకంపాలు వణికించాయి. ఇండోనేషియాలోని బాలీ, జావా ద్వీపాలపై రెండు భూకంపాలు విరుచుకుపడ్డాయి. ఈ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది. ఈ భూకంపం తీవ్రతకు రెండు నగరాల్లోని పలు భవనాలు కంపించాయి. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

పుర్వడోయి ప్రాంతానికి ఈశాన్యాన 148 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉందని ఇండోనేషియా విపత్తు నిర్వహణ విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఎంత ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందో ఇంకా స్పష్టత రాలేదన్నారు. భూంకంపం నేపథ్యంలో తాము సునామీ హెచ్చరికలు జారీచేయలేదని స్పష్టం చేశారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలుపుతామని పేర్కొన్నారు.

More Telugu News