Chiranjeevi: యూ ట్యూబ్ లో దూసుకుపోతోన్న 'సైరా' ట్రైలర్

  • భారీ చారిత్రక చిత్రంగా 'సైరా'
  • ఒకే రోజున ఐదు భాషల్లో విడుదల 
  • అభిమానుల్లో పెరుగుతోన్న అంచనాలు

చిరంజీవి కెరియర్లో తొలి చారిత్రక చిత్రంగా రూపొందిన 'సైరా' చిత్రం, వచ్చేనెల 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ప్రధాన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలపై .. చిరంజీవి పవర్ఫుల్ డైలాగ్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తూ సాగింది. సామాజిక మాధ్యమాల్లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ ట్రైలర్ దూసుకుపోతోంది. ఈ ట్రైలర్ యూ ట్యూబ్ ట్రెండింగులో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఈ ట్రైలర్ ను వదిలిన 2 గంటల్లోనే 20 లక్షల వ్యూస్ రావడం విశేషం. ఇప్పటికే ఈ ట్రైలర్ 50 లక్షలకి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. రికార్డుస్థాయిలో ఈ ట్రైలర్ కి వ్యూస్ లభిస్తుండటం పట్ల మెగా అభిమానులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News