The US Navy: అవును.. ఆ 'యూఎఫ్ఓ'ల వీడియోలు వాస్తవమైనవే.. అంగీకరించిన అమెరికా!

  • 2017-18 మధ్య ఈ వీడియోలు బయటకొచ్చాయి
  • వాటిని మా పైలెట్లు గుర్తించారు
  • ఇది అసాధారణ గగన దృశ్యాలు 

అగ్రరాజ్యం అమెరికా సంచలన ప్రకటన చేసింది. తమ భూభాగం సమీపంలో యూఎఫ్ఓ   (గుర్తుతెలియని ఎగిరే వస్తువులు)లు కనిపించడం నిజమేనని అంగీకరించింది. దీనికి సంబంధించి ది స్టార్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థ విడుదల చేసిన వీడియోలు నిజమేనని ప్రకటించింది. 2017-2018 మధ్యలో ఈ వీడియోలు విడుదల అయ్యాయని చెప్పింది.

తమ నావికాదళంలోని పైలెట్లు ఇన్ ఫ్రారెడ్ కెమెరాల ద్వారా ఈ ఎగురుతున్న వస్తువులను గుర్తించారని అమెరికా తెలిపింది. ఈ వ్యవహారాన్ని అసాధారణ గగన దృశ్యాలు అభివర్ణించింది. అయితే ఇవి గ్రహాంతర వాసుల నౌకలా? కాదా? అనే విషయమై మాత్రం అమెరికా నోరు మెదపలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

More Telugu News