Maharashtra: ముంబయిని ముంచెత్తనున్న వర్షాలు...రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణ శాఖ

  • ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని సూచన
  • లోతట్టు ప్రాంతాలకు వరద ప్రమాదం
  • పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

ఆర్థిక రాజధాని ముంబయిలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాననీరు వరద ప్రవాహమై ముంచెత్తుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై నగరంతోపాటు రాయగడ్, రత్నగిరి, సతారా, సాంగ్లీ జిల్లాలలో కూడా ఈ రోజు అతి భారీవర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశముందన్న వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయమవుతాయని తెలిపింది. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో నగరంలోని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలకు ఈ రోజు సెలవు ప్రకటించామని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆశిష్ షెలార్ చెప్పారు. భారీవర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం వున్న నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు

More Telugu News