singareni labour: సింగరేణి కార్మికుల ప్రయోజనాలపై కేసీఆర్‌ కీలక ప్రకటన నేడు

  • లాభాల్లో వాటా పంచే అవకాశం
  • సమస్యలు పరిష్కరించాలని కోరిన ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు
  • పరిష్కారాలు చూపాలని సీఎండీని ఆదేశించిన సీఎం

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు తీపి కబురు అందిస్తుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా లాభాల్లో వాటాను కార్మికులకు పంచే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు అసెంబ్లీలో కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. దీర్ఘకాలంగా ఉన్న సింగరేణి కార్మికుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇటీవల కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేసీఆర్‌ స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై, సమస్యలపై కూలంకుషంగా చర్చించి తనకు నివేదిక అందించాల్సిందిగా సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఆదేశించారు.

అనంతర కాలంలో సింగరేణి గనులున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని గతంలోనే  సీఎం కేసీఆర్ ఆదేశించారు. కార్మిక సంఘాల ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేయాలని ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తి, థర్మల్ పవర్ ప్లాంట్‌లో రికార్డు స్థాయి విద్యుదుత్పత్తి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. తాజాగా  సమస్యల పరిష్కారానికి, లాభాల్లో వాటాపై కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.

More Telugu News