Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నో డైటింగ్ అంటున్న రకుల్ 
  • తొలి షెడ్యూల్ ముగించిన శేఖర్ కమ్ముల 
  • రైతు పాత్రలో కనిపించనున్న వినాయక్

*  'మన దగ్గర డైటింగ్ పేరుతో నోరు కట్టేయడం లాంటిది వుండదు' అంటోంది అందాలతార రకుల్ ప్రీత్ సింగ్. 'నాకు ఇష్టమైన వంటకాలు హాయిగా లాగించేస్తుంటాను. అయితే ఏది తిన్నా ఓ పద్ధతి ప్రకారం తింటాను. మనకసలు డైటింగ్ అన్న మాటే నచ్చదు' అని చెప్పింది రకుల్.
*  నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ నిన్నటితో పూర్తయింది. ఈ షెడ్యూలులో కొన్ని సన్నివేశాలను, ఓ పాటను చిత్రీకరించారు. వచ్చే క్రిస్మస్ కి విడుదల చేసేలా ఈ చిత్ర నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు.
*  ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఓ చిత్రంలో హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. నరసింహారావు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో వినాయక్ రైతు పాత్రలో నటిస్తాడట. ఇది 1940 ప్రాంతంలో జరిగే కథతో సాగుతుందని తెలుస్తోంది.

More Telugu News