Hindi: ‘హిందీ’ని జాతీయభాషగా మార్చాలని నేనెప్పుడూ అనలేదు: అమిత్ షా

  • ప్రాంతీయ భాషలను పక్కన పెట్టాలనే ఆలోచన లేదు
  • రెండో భాషగా మాత్రమే ‘హిందీ’ నేర్చుకోవాలని చెప్పాను
  • నా వ్యాఖ్యలను వక్రీకరించారు

‘హిందీ’ని జాతీయ భాషగా చేయాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విమర్శలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి అమిత్ షా తెరదించారు. ‘హిందీ’ని జాతీయభాషగా మార్చాలని తానెప్పుడూ అనలేదని సమర్థించుకున్నారు. ప్రాంతీయ భాషలను పక్కన పెట్టాలనే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. రెండో భాషగా మాత్రమే హిందీని నేర్చుకోవాలని చెప్పాను తప్ప పైవిధంగా తాను వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. హిందీయేతర భాషా రాష్ట్రం నుంచే తాను కూడా వచ్చానని, తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఎవరైనా రాజకీయాలు చేయాలని చూస్తే వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

More Telugu News