Chiranjeevi: తమిళనాట 'సైరా' భారీ రిలీజ్

  • భారీ చారిత్రక చిత్రంగా 'సైరా' 
  • ఒకే రోజున 5 భాషల్లో విడుదల 
  • అభిమానుల్లో పెరుగుతోన్న అంచనాలు 

చిరంజీవి కథానాయకుడిగా చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' నిర్మితమైంది. దేశభక్తికి సంబంధించిన ఈ చారిత్రక చిత్రాన్ని, గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సినిమాను తమిళంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు విడుదల చేస్తున్నారు. 'సైరా'లో విజయ్ సేతుపతి కీలకమైన పాత్రను పోషించడం వలన, అక్కడ కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ వుంది. అందువలన అక్కడ అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. భారీ తారాగణంతో నిర్మితమైన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.

More Telugu News