Komatireddy Rajagopal Reddy: తెలంగాణలో కాంగ్రెస్ లేదు... ఉత్తమ్, కుంతియా తప్పుకుంటేనే పార్టీకి భవిష్యత్తు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు

  • మరోసారి కాంగ్రెస్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి!  
  • హుజూర్ నగర్ గెలుపు ఎవరిదో ఉత్తమ్ నే అడగాలని సూచన
  • భవిష్యత్తులో బీజేపీదే అధికారం అంటూ వ్యాఖ్యలు

కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేదని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా తప్పుకుంటేనే రాష్ట్రంలో కాంగ్రెస్ బాగుపడుతుందని అన్నారు. హుజూర్ నగర్ గెలుపు ఎవరిదో ఉత్తమ్ నే అడగాలని సూచించారు. కాంగ్రెస్ కు యువ నాయకత్వం కావాలని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో బీజేపీదే అధికారం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే అధిష్ఠానం నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. తలసాని వంటి సీనియర్ రాజకీయవేత్తలు కూడా రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది.

More Telugu News