ap7am logo

దమ్మున్న కథలను మాత్రమే చేస్తానంటోన్న బెల్లంకొండ

Wed, Sep 18, 2019, 11:13 AM
  • 'రాక్షసుడు'తో హిట్ కొట్టిన బెల్లంకొండ 
  • రెగ్యులర్ కథలకు ఇకపై దూరం 
  • కొత్త దర్శకులతోనూ సినిమాలు  
ఆ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా మాస్ సినిమాలు చేస్తూ వెళ్లాడు. అయినా సరైన హిట్ పడకపోవడంతో, రూట్ మార్చుకుని 'రాక్షసుడు' వంటి విభిన్నమైన సినిమా చేశాడు. ఈ సినిమా విజయవంతం కావడంతో ఆయన తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నట్టుగా సమాచారం.

ఇకపై కాన్సెప్ట్ బేస్డ్ కథలను .. కొత్తదనంతో కూడిన దమ్మున్న కథలను మాత్రమే అంగీకరించాలని నిర్ణయించుకున్నాడట. అంతేకాదు, స్టార్ డైరెక్టర్లతోపాటు టాలెంట్ వున్న కొత్త దర్శకులతోను చేయాలనుకుంటున్నాడట. ఈ కారణంగానే కొత్త దర్శకుల నుంచి కథలను వినడానికి ఎక్కువ సమయమే కేటాయిస్తున్నాడని అంటున్నారు. ఇకపై బెల్లకొండ నుంచి రెగ్యులర్ సినిమాలు కాకుండా వైవిధ్యభరితమైన సినిమాలను చూస్తామన్న మాట.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad