Narendra Modi: మోదీ-జిన్ పింగ్ ల మధ్య జరిగే భేటీలో కశ్మీర్ ప్రాధాన్యతా అంశం కాదు: చైనా

  • త్వరలో భేటీ కానున్న మోదీ, జిన్ పింగ్
  • అజెండాలో కశ్మీర్ అంశం ఉండకపోవచ్చన్న చైనా అధికారి
  • ఇరువురు నేతలు వారికి ఇష్టమైన అంశాలపై మాట్లాడతారని వ్యాఖ్య

భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ల మధ్య త్వరలో జరుగనున్న భేటీలో కశ్మీర్ అంశానికి అంత ప్రాధాన్యత ఉండదని చైనా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ కు మద్దతుగా వ్యవహరించిన చైనా... ఇరువురు దేశాధినేతల భేటీలో ఈ అంశాన్ని పక్కన పెట్టడం గమనార్హం.

 చైనా విదేశాంగ శాఖకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ, ఇది అనధికారిక భేటీ కావడంతో అజెండాలో కశ్మీర్ అంశం ఉండకపోవచ్చని తెలిపారు. ఇరువురు నేతలు వారికి నచ్చిన అంశాలపై మాట్లాడతారని చెప్పారు. అయితే, కశ్మీర్ అంశం కీలకమైనది కావడంతో... సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. కశ్మీర్ ను భారత్-పాకిస్థాన్ ల ద్వైపాక్షిక అంశంగానే చైనా పరిగణిస్తోందని చెప్పారు. మరోవైపు, కశ్మీర్ పరిణామాలపై జిన్ పింగ్ కు మోదీ వివరించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.

More Telugu News