Valmiki: పూజా హెగ్డే నడుము మీద చెర్రీ పండుతో కొడతాను: రాఘవేంద్రరావు చమత్కారం

  • 'వాల్మీకి' కోసం సాంగ్ రీమిక్స్
  • పాటను విడుదల చేసిన రాఘవేంద్రరావు
  • వాడిన బిందెల నిండా డబ్బు రావాలన్న దర్శకేంద్రుడు

పూజా హెగ్డేను తాను చూసిన మొదటి రోజునే టాప్ హీరోయిన్ అవుతుందని చెప్పానని, ఇప్పుడు అదే జరిగిందని, ఈ సమయంలో ఆమెతో ఓ పాటను చేయాల్సి వస్తే, పూజ నడుమును చెర్రీ పండుతో కొడతానని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చమత్కరించారు. సుమారు 37 సంవత్సరాల క్రితం తాను దర్శకత్వం వహించిన "వెల్లువొచ్చి గోదారమ్మా..." పాట రీమిక్స్ ను 'వాల్మీకి' చిత్రం కోసం వరుణ్ తేజ్, పూజలపై చిత్రీకరించగా, ఈ పాటను నిన్న రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో రాఘవేంద్రరావు విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోజు పాట చిత్రీకరణ నిమిత్తం 1000 బిందెలను వాడామని, ఇప్పుడు సినిమా కోసం వాడినన్ని బిందెల నిండా డబ్బులు నిర్మాతలకు చేరాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇక 'దేవత' గురించిన వివరాలు చెబుతూ, ఈ సినిమా పాట చిత్రీకరణ నిమిత్తం ఉండ్రాజవరంలో ఉన్న సమయంలో, రాత్రి పడుకుని పాటను ఎలా తీయాలని ఆలోచిస్తుండగా, ఎక్కడి నుంచో 'ఠంగ్ ఠంగ్' మంటూ శబ్దం వినిపించిందని, ఏంటని అడిగితే, పక్క ఊళ్లో ఇత్తడి బిందెలు తయారు చేస్తారని చెప్పగా, పాటను ఆ బిందెల నేపథ్యంలో తీయాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు. కాగా, ఈ శుక్రవారం 'వాల్మీకి' చిత్రం విడుదల కానుంది. 

More Telugu News