Kodela: ప్రభుత్వ లాంఛనాలు మాకొద్దు: తిరస్కరించిన కోడెల కుటుంబం

  • మొన్న ఆత్మహత్య చేసుకున్న కోడెల
  • నేడు స్వర్గపురిలో అంత్యక్రియలు
  • కడసారి చూసేందుకు తరలివస్తున్న అభిమానులు

ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు నేడు నరసరావుపేటలో జరుగనుండగా, ప్రభుత్వ లాంఛనాలు తమకేమీ వద్దని కోడెల కుటుంబీకులు స్పష్టం చేశారు. కోడెల అంత్యక్రియలను అన్ని అధికార లాంఛనాలతో నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

 బతికున్న సమయంలో వేధించి, ఇప్పుడు లాంఛనాలు ఎందుకని ఆయన కుటుంబ సభ్యులు మండిపడ్డారు. కోడెల కుటుంబీకులెవరూ ప్రభుత్వ మొక్కుబడి లాంఛనాన్ని అందుకునేందుకు సిద్ధంగా లేరని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు వెల్లడించారు. కాగా, పేటలో కోడెల అభివృద్ధి చేసిన స్వర్గపురిలోనే నేటి మధ్యాహ్నం అంత్యక్రియలు జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమ అభిమాన నేతకు కడసారి నివాళులు అర్పించేందుకు అభిమానులు పోటెత్తారు.

More Telugu News