Chandrababu: రాజకీయాల్లో ‘ఇంత డర్టీగా’ వ్యవహరించే పరిస్థితులు వస్తాయా?: చంద్రబాబుపై అంబటి ఫైర్

  • కోడెల మృతికి గల కారణాలను మాపై రుద్దాలని చూస్తున్నారు
  • సానుభూతి, రాజకీయ లబ్ధి పొందాలని బాబు యత్నం
  • రాజకీయాల్లో ఇది నీచమైన ఎత్తుగడ

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ బలవన్మరణానికి వైసీపీ ప్రభుత్వం వేధింపులే కారణమని టీడీపీ చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఖండించారు. తాడేపల్లిలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోడెల మృతికి గల కారణాలను ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్, వైసీపీపై రుద్దాలని చంద్రబాబునాయుడు చూస్తున్నారని మండిపడ్డారు. తద్వారా సానుభూతిని, రాజకీయ లబ్ధిని పొందాలని బాబు చూస్తున్నారని విమర్శించారు.

రాజకీయాల్లో ‘ఇంత డర్టీగా’ వ్యవహరించే పరిస్థితులు వస్తాయా? అని ప్రశ్నించారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకూ చంద్రబాబు నాలుగుసార్లు మీడియా ముందుకు వచ్చారు, నిన్న రాత్రి పదకొండు గంటల తర్వాత మీడియా సమావేశం నిర్వహించారని విమర్శించారు. ‘కోడెలది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య’ అని ప్రజలను నమ్మించేలా చంద్రబాబు పదేపదే చెబుతున్నారని, రాజకీయాల్లో ఇది నీచమైన ఎత్తుగడగా తాను భావిస్తున్నానని అన్నారు.

More Telugu News