Telangana: నిజాం తర్వాత నేనే నవాబును అని కేసీఆర్ అనుకుంటున్నారు: సీపీఐ నేత నారాయణ

  • తెలంగాణ సాయుధపోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోంది
  • నిజాం తలొగ్గింది నాటి తెలంగాణ సాయుధ పోరాటానికి
  • పటేల్ వల్లే విముక్తి కలిగిందని బీజేపీ ప్రచారం తగదు

తెలంగాణ సాయుధపోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సీపీఐ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన నారాయణ మాట్లాడుతూ, నాటి తెలంగాణ సాయుధ పోరాటానికి నిజాం తలొగ్గితే, సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే విముక్తి కలిగిందని బీజేపీ ప్రచారం చేస్తోందని విమర్శించారు.

‘నిజాం నవాబు తర్వాత నేనే నవాబును’ అని కేసీఆర్ అనుకుంటున్నారని, రాష్ట్రంలో పాలన పడకేసిందని అన్నారు.ఎంఐఎంను చూసి పాలకులు భయపడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని అన్నారు. మరో నేత చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో మరో సమరశీల పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.

More Telugu News