Kodela: కోడెల మొబైల్ ఫోన్ కోసం నివాసంలో సోదాలు జరిపిన పోలీసులు!

  • కోడెల పర్సనల్ ఫోన్ మాయమైనట్టు గుర్తించిన పోలీసులు
  • నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఫోన్ స్విచాఫ్
  • కోడెల సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు

మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో ఆయన ఫోన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు ఆయన నివాసంలో సోదాలు జరిపారు. ఆత్మహత్య అనంతరం పోలీసుల సాధారణ పరిశీలనలో ఆయన పర్సనల్ ఫోన్ కనిపించలేదు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో కోడెల ఫోన్ స్విచాఫ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. కోడెల చివరిగా 24 నిమిషాల పాటు ఓ కాల్ మాట్లాడినట్టు తెలుసుకున్నారు. మరిన్ని వివరాల కోసం పోలీసులు కోడెల గన్ మెన్, ఇద్దరు డ్రైవర్లను, సెక్యూరిటీ గార్డును ప్రశ్నించారు. కోడెల కాల్ డేటా పరిశీలిస్తే కీలక సమాచారం లభ్యమవుతుందేమోనని పోలీసులు భావిస్తున్నారు.

More Telugu News