Chiranjeevi: 'సైరా' ప్రీ రిలీజ్ వేడుకకు కొత్త డేట్!

  • భారీ చారిత్రక చిత్రంగా 'సైరా'
  • ఈ నెల 22న ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • వచ్చేనెల 2వ తేదీన సినిమా విడుదల

చిరంజీవి కెరియర్లోనే తొలి చారిత్రక చిత్రంగా 'సైరా' రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా, గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా నిర్వహించాలని భావించారు. ఈ నెల 18వ తేదీన ఈ వేడుకను జరపాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన వాయిదా వేసుకోవలసి వచ్చింది.

కొంతసేపటి క్రితం ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ను వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ - ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకను జరపనున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుందనే విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అమితాబ్ .. జగపతిబాబు .. సుదీప్ .. విజయ్ సేతుపతి .. తమన్నా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

More Telugu News