Amit Shah: తనకు సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ చాలన్న అమిత్ షా!

  • ఎన్ఎస్జీ కమాండోలు వద్దన్న అమిత్ షా!
  • మోదీ తర్వాత అమిత్ షాకే ఎక్కువ ముప్పుందంటున్న నిఘా వర్గాలు
  • సెక్యూరిటీ అసెస్ మెంట్ కమిటీ ప్రతిపాదన తిరస్కరించిన అమిత్ షా!

కేంద్ర హోం శాఖ మంత్రి అంటే జడ్ ప్లస్ కేటగిరీతో ఎన్ఎస్జీ భద్రత ఉండడం సహజం. కానీ ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం ఎన్ఎస్జీ భద్రత వద్దంటున్నారు. తనకు ఇంతకుముందు కల్పించిన సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ చాలంటున్నారు. గత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు జడ్ ప్లస్ కేటగిరీతో ఎన్ఎస్జీ కమాండోలు భద్రత కల్పించేవారు. కానీ, అమిత్ షా మాత్రం మూడు షిఫ్టుల్లో 100 మంది కమాండోలతో ఏర్పాటు చేసే సీఆర్పీఎఫ్ భద్రతనే కోరుకుంటున్నారు. సీఆర్పీఎఫ్ కమాండోలతో పాటు అమిత్ షా నివాసం వద్ద 50 మంది ఢిల్లీ పోలీసులు కూడా భద్రత విధుల్లో పాల్గొంటారు.

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అమిత్ షాకే ఎక్కువ ముప్పు ఉందని కేంద్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో వీఐపీ సెక్యూరిటీ అసెస్ మెంట్ కమిటీ సమావేశమై ఎన్ఎస్జీ కమాండోలతో భద్రత ఏర్పాటు చేసేందుకు అమిత్ షాకు ప్రతిపాదనలు పంపగా, ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. తనకు ఇప్పుడున్న సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ చాలని పేర్కొన్నట్టు సమాచారం.

More Telugu News