Mano Viragi: మోదీ మరో బయోపిక్ గా 'మనో విరాగి' .. ప్రభాస్ చేతుల మీదుగా ఫస్టులుక్ రిలీజ్

  • మోదీ బయోపిక్ గా 'మన్ బైరాగి'
  • తెలుగు టైటిల్ గా 'మనో విరాగి'
  • టీమ్ కి అభినందనలు తెలిపిన ప్రభాస్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితచరిత్ర ఆధారంగా ఆ మధ్య 'పి.ఎమ్.నరేంద్ర మోదీ' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. వివేక్ ఒబెరాయ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మరో బయోపిక్ గా హిందీలో 'మన్ బైరాగి' చిత్రం రూపొందుతోంది. సంజయ్ లీలా భన్సాలీ - మహావీర్ జైన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, సంజయ్ త్రిపాఠి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ రోజున మోదీ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి హిందీ - తెలుగు ఫస్టులుక్ లను హీరో ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ప్రభాస్ తన ఫేస్ బుక్ .. ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఈ ఫస్టులుక్ లను రిలీజ్ చేస్తూ, ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. అలాగే ఈ సినిమా టీమ్ కి అభినందనలు అందజేశాడు. నరేంద్ర మోదీ గురించి ఎవరికీ తెలియని విషయాలను ఈ సినిమాలో ప్రస్తావిస్తారని అంటున్నారు.

More Telugu News