Tollywood: విజయ్ దేవరకొండ కొత్త సినిమా..‘వరల్డ్ ఫేమస్ లవర్’!

  • సినిమాకు క్రాంతిమాధవ్ దర్శకత్వం
  • ఈ నెల 20న ఫస్ట్ లుక్ విడుదల
  • దేవరకొండకు జంటగా రాశీఖన్నా

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ ను దర్శక, నిర్మాతలు ప్రకటించారు. దీనికి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ టైటిల్ ను ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈ నెల 20 సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించింది.

క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రాశీఖన్నా నటిస్తోంది. కేథరిన్, ఐశ్వర్య రాజేశ్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ వారు నిర్మిస్తుండగా, గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

More Telugu News